FbTelugu

బ్యాంకులలో బ్లాక్ చైన్ టెక్నాలజీ

న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకులలో మోసాలకు చెక్ పెట్టేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్స్ బ్లాక్ చైన్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశాయి.
దాదాపు బ్యాంకులలో పేపర్ తో పని లేకుండా లావాదేవీలను కొనసాగించనున్నారు. దీని మూలంగా సమయం ఆదా అవ్వడంతో సురక్షిత లావాదేవీలకు అవకాశం ఏర్పడి ఖాతాదారుల కు మరింత భద్రత లభిస్తుంది.

బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వరంగా మారనున్నది. అన్ని రకాల లావాదేవీలు తొందరగా, సురక్షితంగా పూర్తికావడంతో మోసాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. ఇవే కాకుండా జి.ఎస్.టి ఇన్వాయిస్ లు, ఈ వే బిల్లుల ప్రాసెసింగ్ ఇప్పటి వరకు సంప్రదాయ పద్దతుల్లో జరిగేవి. వీటి ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. లెటర్ ఆఫ్ క్రెడిట్, లేటర్ ఆఫ్ అండర్ టేకింగ్ కుంభకోణాలకు చెక్ పడనున్నది. వీటితో బంగారు ఆభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, ఆయన మేనమాన మెహుల్ చోక్సీ వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించి విదేశాలకు పరారీ అయ్యారు. ఈ మోసాలకు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ చెక్ పెడుతుందని అంటున్నారు. ఈ సాంకేతికతతో మున్ముందు బ్యాంకులు మరింత వేగిరంగా సేవలు అందించనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.