తిరుపతి: గాజుగ్లాసు గుర్తును ఎవరూ రద్దు చేయలేదని.. రద్దయిందని తప్పుడు ప్రచారం చేసే పనిలో బీజేపీ నేతలు ఉన్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
గాజుగ్లాసు గుర్తు నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కే ఉందన అన్నారు. ఈ విషయాన్ని స్థానిక రిటర్నింగ్ అధికారి, ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసిందన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఎవరు తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఈసి, ఏపి డిజిపి కి ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనసేనకు గత ఎన్నికల్లో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఈసారి నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడంతో గందరగోళం నెలకొన్నది. దీన్ని తొలగించాలని బిజెపి, జనసేన పార్టీలు ఈసికి వినతి చేశాయి.