FbTelugu

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం

అహ్మదాబాద్: గుజరాత్ లో ఇవాళ ఆరు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా ఎగుర వేసింది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం ఆరు కార్పొరేషన్లను కైవసం చేసుకున్నది.

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆప్ అనూహ్యంగా 27 సీట్లలో గెలుపొందింది. ఈ కార్పొరేషన్ లో 120 సీట్లకు గాను 51 సీట్లను బీజేపీ దక్కించుకున్నది. ఆరు కార్పొరేషన్లలో 576 వార్డులకు గాను బీజేపీ 366, కాంగ్రెస్ 51, మిగతా పార్టీలు 27 సాధించాయి. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సెక్యులర్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకుండా ఉండేందుకు బీజేపీ ప్రభుత్వం పక్కాగా వార్డులను విభజించింది. ఏ వార్డులో కూడా ముస్లింల ఓటర్ల జనాభా ఐదారు శాతం లోపు ఉండే విధంగా వార్డులను పునర్విభజన చేశారంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.