FbTelugu

‘తెలంగాణలో కూడా అధికారం మాదే’: బండి సంజయ్

హైదరాబాద్: భవిష్యత్తులో తెలంగాణలో కూడా తమదే అధికారం అంటూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

ప్రతి భారతీయుడు ఎదురుచూసిన ఘట్టం నిన్న మొదలైందని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో కూడా అధికారం తమదేన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పింక్, గ్రీన్ జెండాలు కలిసినా కాషాయందే విజయమన్నారు.

You might also like