FbTelugu

చర్చల పేరుతో కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్

హైదరాబాద్‌: చర్చల పేరుతో ఉద్యోగులను ప్రగతి భవన్ పిలిపించి బిర్యానీలు, కబాబులు తినిపించిన సీఎం కేసీఆర్ వారికి పీఆర్సీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కు చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రగతి భవన్ పిలిపించి బిర్యానీలు, చికెన్ టిక్కాలు వడ్డించడమేంటనీ ఆయన ప్రశ్నించారు. ఇలా ఆరు సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కరించకుడా తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ను నియమించాలని ఏబీవీపీ నిరసన చేస్తోంటే.. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జి చేయడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులకు, పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగులకు కొన్నేళ్ల నుంచి పదోన్నతులు లేవు, కిందిస్థాయి సిబ్బంది సిబ్బందిని పట్టించుకోవడం లేదన్నారు. 1990 నుంచి ఇప్పటి వరకు సివిల్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతులు లేవని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని విభాగాల్లో పదోన్నతులలుకల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ సీఎం పదవికి అర్హుడని ఇటీవల పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను పరిగణనలోకి తీసుకుంటే కేసీఆర్‌ అర్హుడు కాదా.? అని ఆయన ప్రశ్నించారు. 2023లో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.