FbTelugu

మొహర్రం కు లేని ఆంక్షలు గణేష్ ఉత్సవాలకా?: బీజేపీ

అమరావతి: మద్యం షాపులపై లేని ఆంక్షలు గణేష్ చవితి పండుగపై ఎందుకు? అని బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు.

వినాయక చవితి విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రభుత్వానికి రాసిన లేఖ మీద ప్రభుత్వం అధికారిక సమావేశం ఎందుకు నిర్వహంచలేదని ఆయన అడిగారు. అన్ని జిల్లాల్లో `మొహర్రం’ పండుగకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసి ముందస్తు అనుమతులు ఇచ్చారు. మరి వినాయకచవితి విషయంలో ఈ ప్రభుత్వాలకు ఎందుకు దయ లేదని ఆయన నిలదీశారు. ఇదే కదా ఓటు బ్యాంకు రాజకీయం ?. హిందూ సమాజాన్ని అన్ని గమనిస్తుందన్నారు. సరైన సమయంలో మీకు మీ పార్టీలకు, మీ ప్రభుత్వాలకు ప్రజలు సరైన సమాధానం చెబుతారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

You might also like