FbTelugu

ఎన్నికల ప్రచారంలో తిరుమల లడ్డూలు: బీజేపీ

తిరుమల: అధికార పార్టీ ఆఖరికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు.

ఇవాళ ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఓటర్లకు పంచడం దేవుడిని అవమానించడమేనని ఆయన అన్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారానికి వేల లడ్డులు తిరుమల నుంచి ఎలా వెళ్లాయో టీటీడీ సమాధానం చెప్పాలన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.