FbTelugu

చీ చీ తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ: సోము వీర్రాజు

విజయవాడ: తిరుపతి ఉప ఎన్నికలో దొంగఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందని, దొంగ ఓట్లకు నైతిక బాధ్యత వహిస్తూ సిఎం జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

వైసిపి ప్రభుత్వం రాజీనామా చేసేవరకు బీజేపీ-జనసేన ఉద్యమం చేస్తుందన్నారు. ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా మరో వైపు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియాతో ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. ఓటర్లను బెదిరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వైసిపి అమలు చేస్తున్న నవరత్నాలు, అభివృద్ధి గెలిపిస్తాయనుకుంటే ఇన్ని దారుణాలు అవసరమా? అని నిలదీశారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందన్నారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.