FbTelugu

రామతీర్థానికి అనుమతించాలి: సోము వీర్రాజు

విశాఖపట్నం: రామతీర్థం రామాలయం మందిరానికి అనుతించకపోవడం దారుణమని, అనుమతించడంవల్ల జగన్‌ ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు.

రాముడికి అపచారం జరిగితే… రాముడంటే అభిమానం ఉన్న మా పార్టీని ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు దర్శనానికి అనుమతించరని ప్రశ్నించారు. బేషరతుగా మమ్మల్ని రాముడి మందిరానికి పంపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ద్వందవైఖరిపై పోరాడతామని ఆయన హెచ్చరించారు. పోలీసులు ప్రభుత్వంతో చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండొద్దని వీర్రాజు సూచించారు.

తాను ఏనేరం చేశానని హోటల్‌ గదిలో నిర్బంధిస్తున్నారని బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్‌ డియోధర్‌ పోలీసులను ప్రశ్నించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్రాత్రేయను కలవడానికి విశాఖ వచ్చానని అన్నారు. నేను రామతీర్ధం వెళ్తాననే సాకుచెప్పి నన్ను హోటల్‌లో నిర్బంధిచడాన్ని తప్పుపట్టారు. తనకు స్వేచ్ఛలేకపోవడానికి ఇదేమన్నా క్రైస్తవ రాష్ట్రమా? జెరూసలేమా? లేక రోమ్‌ నగరమా? అని సునీల్ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.