FbTelugu

అక్రమాలపై ప్రశ్నిస్తే హత్య చేస్తారా..?: బండి సంజయ్

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్యకు గురవ్వడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ హత్యలకు టీఆర్ఎస్ గూండాలే కారణమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.
ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు వ్యతిరేకంగా చాలామంది బాధితులు అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిలను ఆశ్రయించారని తెలిపారు.

న్యాయపరంగా పోరాడుతున్న వీరు చివరకు వారు కూడా దారుణ హత్యకు గురికావడం బాధాకరమన్నారు. వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై వామన్ రావు దంపతులు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశారని సంజయ్ అన్నారు.
గతంలో శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో వామన్ రావు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించగా వారికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ హత్యలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినవేనన్నారు. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదు. కొంతమంది మంథనికి చెందిన అధికార పార్టీ నాయకులు పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసి ముఖ్యమంత్రి పుట్టినరోజు గిఫ్టుగా ఇచ్చారని సంజయ్ ఆరోపించారు.
వామన్ రావు దంపతుల హత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.