FbTelugu

కెసిఆర్ ను అప్పుడెందుకు విచారించలేదు: బండి సంజయ్

హైదరాబాద్: యుపిఏ ప్రభుత్వం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేసిన కె.చంద్రశేఖర్ రావు పై అప్పటి యుపిఏ ప్రభుత్వం ఎందుకు విచారించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
సిఎం కెసిఆర్ అవినీతి పై సిబిఐ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ పదే పదే బిజెపి ని ప్రశ్నించడం సరైంది కాదని ఆయన అన్నారు.

టిఆర్ఎస్ లో, ప్రగతి భవన్ లో బిసిలతో పాటు దళితులకు ఏమాత్రం గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఈ నెల 13 లేదా 14వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షడు జెపి.నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకుంటున్నారన్నారు. ఈటల రాజేందర్ బిజెపిలో చేరే బదులు స్వతంత్రంగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడ్డం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కరోనా ను నియంత్రించడం చేతకాక, ప్రజలకు ఆసుపత్రులలో సౌకర్యాలు కల్పించలేకే ఐటి మంత్రి కెటిఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని సంజయ్ అన్నారు. తండ్రీ కొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడగా ఆయన అభివర్ణించారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటళ్లలో చేరితే లక్షలు లూటీ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించకుండా కళ్లప్పగించి చూస్తున్నదని సంజయ్ విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.