FbTelugu

కేసీఆర్ ఫామ్ హౌస్ వీడడం లేదు: బండి సంజయ్

వరంగల్: కరోనా కారణంగా పేద ప్రజలు పిట్టల చనిపోతుంటే.. సీఎం కేసీఆర్ పామ్ హౌస్ లో పడుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ లో వరదలు వస్తే బాదితులకు రూ.10 వేలు ఇచ్చారు.. ఇక్కడ వరదలు వస్తే ఒక్క రుపాయి ఇవ్వలేదన్నారు.

ఇవాళ గ్రేటర్ వరంగల్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్డు షో నిర్వహించారు. మాకు ఒక్క కార్పొరేటర్ ఉన్నా ఓరుగల్లు నగరానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. వడ్డించేవాడికి అధికారం ఇస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఓరుగల్లు బస్టాండ్ కి కేంద్రం అధీనంలో ఉన్న రైల్వే స్టేషన్ కి తేడా చూడండని ఆయన కోరారు. బస్టాండ్ కూలిపోయే స్థితిలో ఉందని, అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకొండి అభివృద్ది తెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఓరుగల్లులో కరోనా కంటే ఘోరమైన పరిస్థితి తలలు నరికే పరిస్థితి వస్తుందన్నారు. తలలు నరికే పార్టీ కావాలా.. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే అభివృద్ధి చేసే పార్టీ కావాలా..? అని ఆయన ప్రశ్నించారు.
గ్రేటర్ వరంగల్ లో పేదలకి అండగా ఉండే పార్టీ బిజేపి అని, పంచేందుకు కోట్ల రూపాయలు నగరంలో దిగాయన్నారు. డబ్బులు తీసుకుని బీజేపీకి ఓట్లు వేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.