FbTelugu

బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని నమ్మించే కుట్ర: బండి సంజయ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని నమ్మించే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాల్సిన ఖర్మ, అగత్యం బీజేపీకి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలను నాశనం చేసే పార్టీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ కానే కాదని అన్నారు. మజ్లిస్ పార్టీతో కలిసి హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను ఏదో పథకం పేరుతో మభ్యపెడుతున్న కేసీఆర్ పారటీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఆయన డ్రామాలను ఇంకా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు, మంత్రుల మీదే నమ్మకం లేదని, ఇంకా ప్రజలను ఎందుకు నమ్ముతారని సంజయ్ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.