FbTelugu

వేధింపులకు టైమ్ ఉంది… కరోనా నియంత్రణపై లేదు!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు చేసేందుకు సిఎం కెసిఆర్ కు సమయం ఉందని, కరోనా వచ్చి జనం చస్తున్నా, ఆక్సిజన్ లేదని మొత్తుకుంటున్న పరిష్కరించేందుకు సమయం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తీసుకుని ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఉపయోగం లేదన్నారు.

కరోనా నియంత్రణ కోసం నలుగురు ఐఏఎస్ లను నియమిస్తే సంతోషించేవాళ్లమని, వేధింపుల కోసం నియమించడం సిగ్గుగా ఉందన్నారు. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్, ఆసుపత్రుల దోపిడిని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలకులకు మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని స్మశాన వాటికల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.