FbTelugu

ఐజీ ప్రభాకర్ రావు భాగోతం విప్పుతాం: బండి సంజయ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు.
గుర్రంపోడులో బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా యాత్రకు పోలీసులు రక్షణగా వచ్చారని అనుకున్నామని, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలను కాపాడేందుకు వచ్చినట్లు తరువాత తెలిసిందని సంజయ్ అన్నారు. గిరిజనుల భూములు కాపాడేందుకు వెళ్లిన తమపై పోలీసులు దారుణంగా లాఠీ చార్జీ చేశారన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది 2023 వరకేనని, ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రభాకర్ రావు కథలు అన్నీ బయటకు తీసి శిక్షలు వేయిస్తామన్నారు. ఆయనను ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టమని, ఆయన సంగతి తేల్చుతామన్నారు. అవినీతి మంత్రుల చిట్టా కూడా రూపొందిస్తున్నామని, ఎవరినీ వదిలేది లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.