FbTelugu

జీసస్ ను మోసగిస్తున్న క్రైస్తవ లీడర్లు: సునిల్

తిరుపతి: క్రైస్తవ మతంలో చేరి హిందూ ఎస్సీ కులాల జాబితాలో ఉన్నట్లు సర్టిఫికెట్లు తెచ్చుకున్న ఎంతో మంది ఎమ్మెల్యేలు ఏసుక్రీస్తును సైతం మోసం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర సహ ఇన్ ఛార్జి సునిల్ ధియోధర్ ఆరోపించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ క్రిష్టియన్ కాదని హిందూ దేవతలను ఆరాధించారని అన్నారు. హిందూమతంలో సామాజిక న్యాయం కోసం పోరాడారు. క్రిష్టియన్లు, ముస్లింలు ఆహ్వానించినా దేశంలో పుట్టిన బౌద్ధ మతాన్నే ఆచరించారు. గ్రామ గ్రామాన నెలకొల్పిన ఆయన విగ్రహాలుచూసి గర్వపడుతున్నా, కాని నేడు ఎస్సీ, ఎస్టీలున్న ప్రాంతాల్లో ప్రభుత్వమే పెద్ద పెత్తున మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికార ప్రముఖులంతా క్రైస్తవులేనన్నారు.

హోంమంత్రి సుచరిత క్రైస్తవురాలు.. కానీ ఆమె హిందూ ఎస్సీగా చెప్పుకుని టిక్కెట్ తెచ్చుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య హిందూ ఎస్సీ సర్టిఫికెట్ తో టిక్కెట్ సాధించారు. కాని ఆయన ఈస్టర్, గుడ్ ఫ్రేడే రోజుల్లో స్వయంగా సిలువ మోసారని సునిల్ ఆరోపించారు.
ఈ ప్రభుత్వానికి అప్పులు తీర్చే సామర్థ్యం లేదని, సిఎం అయిన తరువాత జగన్ రూ.1 లక్ష కోట్లు అప్పుచేశారు. ఈ నెల జీతాలు కొన్ని శాఖల్లో ఇంత వరకు ఇవ్వలేదు. అప్పులు తెచ్చి ఉచితంగా పంచుతున్నారు. ప్రత్యేక హోదా కన్నా అధిక ప్రయోజనాలు కలిగించే ప్యాకేజీని ఇచ్చామన్నారు. అంతర్వేది, రామతీర్ధం నిందితులను ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేకపోయారు?. మీ పోలీసులకు సత్తాలేక సీబీఐ కోరారా?. ఎపీ పోలీసులకు ధైర్యం, సాహసం, నేర్పు ఉన్నా అరాచక, రౌడీ, గుండా, మాఫియా ప్రభుత్వం వారిని కట్టడి చేస్తోందని సునిల్ ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో గురుమూర్తి గెలిస్తే జగన్ సేవలో తరిస్తారు. బిజెపి అభ్యర్థి, మాజీ ఐఎఎస్ అధికారి రత్నప్రభ సేవభావం కలిగినవారని, హిందూ మాదిగ కులానికి చెందిన అభ్యర్థి అన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఎస్సి ప్రధానకార్యదర్శి గా కర్ణాటక ప్రభుత్వం నియమించిందన్నారు. వైసిపి అభ్యర్థి గురుమూర్తి హిందువే అయితే ఎందుకు వెంకన్నను దర్శించుకోలేదని సునిల్ ప్రశ్నించారు.

రెండు కుటుంబాలదే రాజ్యం: సోమువీర్రాజు
రాష్ట్రంలో రెండు కుటుంబాలు ప్రజల రక్తాన్ని రాబందుల్లా తాగేస్తున్నాయని, మద్యాన్ని పరిశ్రమలా మార్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. భూమి, ఇసుక, ఎర్రచందనం వంటి ప్రకృతి వనరులు దోచేస్తున్నారు. ఎస్సీల్లో ఒక వర్గం కంటే వెనుకబడిన మదిగ మహిళకు మనం సీట్లిచ్చాం. రాష్ట్రంలోని ఉప ముఖ్యమంత్రులు ధైర్యంగా తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్ వద్ద చెప్పగలరా? అని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఉన్నా ఒక డీఎస్పీని బదిలీ చేయగలరా అన్నారు.
రెండు పార్టీల్లో రెండు కులాలదే పెత్తనం: జీవిఎల్ నరసింహారావు
రాష్ట్రంలో సామాజిక న్యాయం మాటల్లో తప్ప చేతల్లో లేదని రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు ఆరోపించారు. టిడిపి, వైసిపిలలో కమ్మ, రెడ్డి కులస్తులదే ఆధిపత్యం ఉందన్నారు. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే అందులో 51నుంచి 55 మంది రెడ్లి కులం వారున్నారు. టిడిపి హయాంలోనూ కమ్మ కులం నుంచి అత్యధిక మంది ఎమ్మెల్యేలుండేవారని వివరించారు. కమ్మ, రెడ్లతో ఇంకెక్కడ సామాజిక న్యాయం అమలౌతుందో చెప్పాలన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే ఇంత వరకు ప్రాధాన్యత లభించిన వర్గాలు మరింత వెనుకబాటుకు గురౌతాయని హెచ్చరించారు. అంతరాలు పదిరెట్లు పెరుగుతాయని, అందువల్ల సామాజిక న్యాయం జరగాల్సిందేనని నరసింహారావు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.