FbTelugu

సింగరేణిలో ఎమ్మెల్సీ కవిత దందాలు: తరుణ్ చుగ్

మంచిర్యాల: సింగరేణి కాలరీస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని, ఎమ్మెల్సీ కల్వకుంల కవిత పెత్తనం చెలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ ఆరోపించారు.

శ్రీరాంపూర్ లో పర్యటించిన తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. వేలాది కోట్ల రూపాయల ఆదాయం కల సింగరేణి ని సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకు తింటున్నదని ఆయన అన్నారు. ఉన్నతాధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న కవిత ను విచారించక తప్పదని ఆయన హెచ్చరించారు. కార్మికులు, కార్మిక నేతలపై ఆధిపత్యం చెలాయించే అధికారం ఆమెకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. సింగరేణి సీఎం ఎన్.శ్రీధర్ సరిగా పనిచేయడం లేదని, టీఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.