FbTelugu

కుక్కను చంపిన వ్యక్తిని అరెస్టు చేయాలి: మేనకా గాంధీ

ఢిల్లీ: కుక్కను కారుతో తొక్కించి చంపిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ పంజాబ్ సీఎం ను కోరారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఈ ఘటన పై స్పందించారు.
దండూపూర్ కు చెందిన గురీందర్ సింగ్ కుక్కలను బ్రీడింగ్ చేయడంతో పాటు వాటని పోటీల కోసం విక్రయిస్తాడని అన్నారు.

కుక్కల అవసరం తీరిపోయిన తరువాత హింసించి చంపుతూ ఆనందం పొందుతుంటాడు. ఒక కుక్కను ఇటీవల కారుతో తొక్కించి చంపగా బాధను అనుభవించి అర గంటల తరువాత చనిపోయిందని మేనకా గాంధీ విచారం వ్యక్తం చేశారు.

You might also like