FbTelugu

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన బిజెపి ప్రత్యర్థులు

న్యూఢిల్లీ: మూడు ప్రధాన రాష్ట్రాలలో బిజెపి ప్రత్యర్థి పార్టీలు మ్యాజక్ ఫిగర్ దాటాయి. ఈ ఫలితాలు బిజెపి నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా కు కంటినిండా కునుకు లేకుండా చేస్తాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలలో డిఎంకె, టిఎంసి, ఎల్.డి.ఎఫ్ పార్టీలు విజయం దిశగా సాగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌ లో మూడోసారి తృణముల్ కాంగ్రెస్ అధికారంలోకి రానున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలోని టిఎంసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్ల సంఖ్యను దక్కించుకున్నది. మొత్తం 292 స్థానాలకు గాను 185 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనానాడు లో డిఎంకె అభ్యర్థులు దూసుకు పోతున్నారు. మొత్తం 234 సీట్లకు గాను 130 సీట్లలో డిఎంకె అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ డిఎంకె 130 సీట్లలో, ఎఐడిఎంకె 103 సీట్లలో ముందంజలో ఉన్నాయి.

కేరళ చరిత్రలో రెండోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా ఎల్.డి.ఎఫ్ పయనిస్తున్నది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లకు గాను ఎల్.డి.ఎఫ్ 88 సీట్లు, యుడిఎఫ్ 49 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బిజెపి మూడు సీట్లకే పరిమితం అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.