FbTelugu

సచిన్ కు బీజేపీ రెడ్ కార్పెట్

ఢిల్లీ: తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసిన కొద్ది నిమిషాల్లో బీజేపీ స్పందించింది. ఆయనకు తమ పార్టీ స్వాగతం పలుకుతోందని ప్రకటించింది.

బీజేపీ విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలో చేరవచ్చని ఆ పార్టీ నేత ఓం మాథుర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బల నిరూపణ చేసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ లో చేరేది లేదంటూ ప్రకటిస్తూ వచ్చిన సచిన్ పైలట్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజస్థాన్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రత్యేక పార్టీ పెట్టి, బీజేపితో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, బీజేపీలో చేరతారా అనేది గమనిస్తున్నారు. పైలట్ శకం ముగియడంతో ఇప్పుడు సీఎం అశోక్ గెహ్లట్ బలనిరూపణ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బల నిరూపణ జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. సీఎం అశోక్ బల నిరూపణ కు ముందుకు వస్తారా లేదా రాజ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది

You might also like

Leave A Reply

Your email address will not be published.