FbTelugu

పిఎం సీటు పై కన్నేసిన కెసిఆర్: డికె.అరుణ

మహబూబ్ నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి పదవి పై కన్నేశారని, భవిష్యత్తులో ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అవసరం ఉంటుందని అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ ఆరోపించారు.

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్.డి.ఎస్) పై ఇన్నాళ్లూ మౌనంగా ఉండడానికి ఇదే కారణమని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు మంత్రులతో ఏపి సిఎం ను తిట్టిస్తున్నారని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి భూ ఆక్రమణలపై కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఎందుకు విచారణ జరపడం లేదని ఆమె ప్రశ్నించింది. మంత్రి, ఆయన సోదరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్వయంగా రైతులు మీడియా ముందుకు వచ్చి చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ పై ఎవరో ఫిర్యాదు ఇస్తే రాత్రికి రాత్రే విచారణ జరిపి బర్తరఫ్ చేసిన సిఎం మహబూబ్ నగర్ మంత్రి విషయంలో మౌనం ఎందుకని నిలదీశారు. మంత్రి భూ కబ్జాలు, దందాలపై విచారణ కమిటీ చేయాలని అరుణ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.