FbTelugu

యూ ఇడియట్… కెటిఆర్ మౌనం?

హైదరాబాద్: వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అసత్యాలు చెబుతావా అంటూ బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ రాష్ట్ర మంత్రి కెటిఆర్ ను దారుణంగా తిట్టాడు.
యూ ఇడియట్ అంటూ మండిపడ్డారు. ప్రపంచంలోనే భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో ముందంజలో ఉందన్నారు. 17.5 కోట్ల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు. మొత్తంగా 22.37 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారని ఖేమ్ చంద్ శర్మ స్పష్టం చేశారు. వాస్తవం ఇలా ఉంటే కెటిఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాటలకు కెటిఆర్ ధీటైన జవాబు ఇవ్వకుండా… సార్ నేను మీలా మాట్లాడగలను అంటూ ముక్తాయించారు. మీలా మాట్లాడ్డం మా సంస్కృతి కాదన్నారు. ఇజ్రాయెల్ లో 60శతం మందికి, అమెరికాలో 40 శాతం మందికి ఇచ్చారు.

ఈ రెండు దేశాలను చూస్తే భారతదేశం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి మా విమర్శలు కఠినంగానే ఉంటాయని కెటిఆర్ చప్పగా బదులిచ్చారు. ఇడియట్ అని తిట్టిగా గట్టిగా బదులివ్వకపోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. బిజెపి తో పంచాయతీ పెట్టుకోవద్దనే ఉద్దేశంతోనే కెటిఆర్ మెతకగా సమాధానం ఇచ్చారని, గట్టిగా విమర్శిస్తే బిజెపి పెద్దలు కన్నెర్ర చేసే ప్రమాదముండవచ్చని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఆదివారం సాయంత్రం లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ హ్యాష్ ట్యాగ్ తో ట్విటర్ లో కెటిఆర్ చాట్ ప్రారంభించిన సందర్భంగా పై వివాదం చోటు చేసుకున్నది. కేంద్రం వ్యాక్సినేషన్ పై కెటిఆర్ విమర్శలు సంధించడంతో బిజెపి నేత ఖేమ్ చంద్ శర్మ పరుష పదజాలంలో బదులిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.