FbTelugu

ఒకరు చనిపోతే.. రెండు అంబూలెన్సులు వచ్చాయి: ఎంపీ స్వామి

ముంబై: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై రోజుకో  విషయం వెలుగులోకి వస్తున్నది. ఇవాళ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రెండు అంబూలెన్స్ లపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

సుశాంత్ సింగ్ చనిపోయిన రోజున ఆయన ఇంటిని రెండు అంబూలెన్స్ లు ఎందుకు వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. సుశాంత్ కు తెలిసిన వ్యక్తి శామ్యూల్ హోకిప్ అదృశ్యం కావడం వెనకాలా ఎవరి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జూన్ 13వ తేదీ రాత్రి సుశాంత్ తో పాటు శామ్యూల్ ఒకే గదిలో ఉన్నారని ఒక టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైందని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు అంబూలెన్స్ లు వెళ్లాయని ఫొటోలు వైరల్ అయ్యాయన్నారు. ఒక ఫొటోలో కాళ్లు నిటారుగా ఉండగా మరో ఫొటోలో ముడుచుకుని ఉన్నాయన్నారు. పోస్టుమార్టం ఒకరికి జరిగిందా, ఇద్దరికి జరిగిందా అనేది వైద్యులు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకు శామ్యూల్ బతికే ఉన్నాడా, చనిపోయాడా అనేది తేలాలని సుబ్రహ్మణ్య స్వామి సీబీఐని కోరారు.

You might also like