FbTelugu

ఆవు మూత్రంతో కరోనా ఉఫ్: ఎంపి ప్రగ్యా

న్యూఢిల్లీ: రోజూ ఆవు మూత్రం తాగితే కరోనా పారిపోతుందని, ఆవు నుంచి వచ్చే పదార్థాలను కలిపి సేవిస్తే క్యాన్సర్ రాదని బిజెపి ఎంపి ప్రగ్యా ఠాగూర్ సెలవిస్తున్నది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది.

ఆవు మూత్రం అపర సంజీవని అని, ఆవు నుంచి వచ్చే పదార్థాలను కలిపి సేవించగా తనకు క్యాన్సర్ వ్యాధి తగ్గిందని ఆమె తెలిపారు. తను రోజు ఆవు మూత్రం తీసుకుంటానని అందుకే తనకు కరోనా రాలేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నది ఈ ఎంపి. కోవాగ్జిన్, కోవిషీల్డ్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు అవసరమే లేదని ఈమె కొట్టిపారేస్తుండడం విశేషం. కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ప్రగ్యా ఠాగూర్ గతేడాది డిసెంబర్ నెలలో ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఆవుమూత్రం సేవిస్తే కరోనా రాదని జనం చెవుల్లో పూలు పెడుతున్నారు. ఆవు పేడ, మూత్రం వలన కరోనా రోగం నయం కాదని, ఇవి నిరోధించలేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. రోగ నిరోధక శక్తి అందిస్తాయని శాస్త్రీయంగా రుజువు కాలేదని చెబుతున్నప్పటికీ బిజెపి నేతలు మాత్రం అబద్దపు ప్రచారాలు చేస్తునే ఉండడం శోచనీయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.