FbTelugu

మోదీకి ఝలక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

గాంధీనగర్: స్వరాష్ట్రంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి సెగ తగిలింది. బీజేపీ ఎంపీ మన్ సుఖ్ వాసవ తన పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ఓ బిర్లాను కలిసి రాజీనామా లేఖ అందచేస్తానన్నారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖలను గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపించారు. తను నిర్వహించిన దానికన్నా ఎక్కువగా పార్టీ తనకు ఇచ్చిందని, అందుకు పార్టీకి ధన్యవాదులు చెబుతున్నానని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలు, జీవితపు విలువలను తూచా తప్పకుండా అమలు చేశానని తెలిపారు. తన తప్పులు పార్టీకి నష్టం కలిగించకుండా చూడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు వాసవ వెల్లడించారు.
గుజరాత్ బీజేపీ నాయకుల అభిప్రాయం ప్రకారం ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నర్మద జిల్లాల్లోని 121 గ్రామాలలో ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకునేలా ఆదేశించాలని ఎంపీ వాసవ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.