FbTelugu

కారు బోల్తా.. ఆస్పత్రిలో బీజేపీ ఎంపీ

BJP-MP-in-hospital-by-car-accident

బీజేపీ ఎంపీ ప్రయణిస్తున్న కారు బోల్తా పడి ఎంపీకి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరిన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీజేపీఎంపీ తీరత్ సింగ్ రావత్ ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలైనాయి. హరిద్వార్ లోని భీమ్ గోదా మీదుగా ఆయన ఈ రోజు ఉదయం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి సమాచారం ఇంకాతెలియాల్సి ఉంది.

You might also like