FbTelugu

కెసిఆర్ ఒక బేవకూఫ్: బిజెపి ఎంపి

కరీంనగర్: సిఎం కెసిఆర్ ఒక బేవకూఫ్ అని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రూ.300 కోట్లు పంపిణీ చేస్తున్నారని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
పైసలు తీసుకున్న టిఆర్ఎస్ నాయకులు ఈటల తో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో పప్పు, బెల్లాల మాదిరి టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆయన తెలిపారు. జమ్మికుంట పట్టణంలో అరవింద్ మాట్లాడుతూ, కెసిఆర్ కు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే కెటిఆర్ ను హుజూరాబాద్ లో నిల్చొబెట్టాలని సవాల్ చేశారు. కెటిఆర్ దిక్కుమాలిన కోర్కె తీర్చేందుకు ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారన్నారు.

కర్మకాలి మళ్లీ టీఆర్ఎస్ గెలిస్తే ఐఏఎస్ అధికారులు గులాంగిరి చేస్తారని అన్నారు. దళితులను ఈ రాష్ట్రంలో అవమనించినంతగా ఎవరూ అవమానించలేదన్నారు. రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి లేడని, నలుగురు అని జోస్యం చెప్పారు. ఒకరు కెసిఆర్ కాగా మిగతావారు కెటిఆర్, కవిత, సంతోష్ కుమార్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కెటిఆర్ అంటున్నాడు, మరి తెలంగాణలో ఫ్యాక్టరీలు ఎందుకు అమ్ముతున్నావని కెసిఆర్ పై అరవింద్ ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కెసిఆర్ కు పట్టుకుందన్నారు. హుజూరాబాద్ ఫలితాల తరువాత టిఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని జోస్యం చెప్పారు. కెటిఆర్ ఈ జన్మలో సిఎం కాలేరని, జరగని పని అని అరవింద్ తేల్చి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.