FbTelugu

మాజీ కేంద్ర మంత్రి రాజకీయాలకు గుడ్ బై!

బెంగళూరు: వెన్నునొప్పి తిరగబెట్టడం, కాలినొప్పి తీవ్రం కావడంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ఘకాలం విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఆయన వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు ఆయన చికిత్స చేయించుకున్నా మళ్లీ తిరగబెట్టింది. దీంతో అప్పట్లోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన అనుకున్నారు. మెరుగుపడడతో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ మధ్య ఆయన తరచూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా తిరగడం మూలంగా తగ్గదని వైద్యులు కూడా స్పష్టం చేశారు. దీనకి తోడు కాలినొప్పి మొదలవ్వడంతో శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి రెస్టు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. కొంత కాలం పాటు అనంతకుమార్ ఎటువంటి సమావేశాలు, కార్యక్రమాలకు హాజరు కారని వ్యక్తిగత కార్యదర్శి సురేశ్ షెట్టి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.