FbTelugu

గవర్నర్ భేటీకి 24 బిజెపి ఎమ్మెల్యేల డుమ్మా

కొలకతా: పశ్చిమ బెంగాల్ బిజెపిలో వెన్నుపోట్లు వెంటాడుతున్నాయి. ఇటీవల పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన సువేంద్ అధికారి కి శాసనసభా పక్షం పదవి కట్టబెట్టడాన్ని బిజెపి ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే బిజెపి నుంచి గెలుపొందిన ముకుల్ రాయ్ తిరిగి టిఎంసి పార్టీలో చేరగా మరో 24 మంది క్యూ లో ఉన్నారు.

సోమవారం సాయంత్రం సువేందు అధికారి రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీకి 24 మంది ఎమ్మెల్యేలు సమాచారం లేకుండా డుమ్మా కొట్టారు. కొందరు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయగా, మరికొందరు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. వీరందరూ టిఎంసిలో వెళ్తారా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయి. బిజెపిలో చాలా మంది ఎమ్మెల్యేలు సువేందు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఈ వివాదం ఇలా ఉండగానే తమతో 30 మంది బిజెపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టిఎంసి ప్రకటించడం అగ్గికి ఆజ్యం పొసినట్లుగా ఉంది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.