FbTelugu

భార్యపై బిజెపి ఎమ్మెల్యే దాష్టికం

సిమ్లా: బిజెపి ఎమ్మెల్య విశాల్ నెహ్రియా భౌతికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆయన భార్య ఓషిన్ శర్మ ఆరోపించింది. భార్త పై విడుదల చేసి వీడియో ఉత్తర భారత దేశంలో వైరల్ అయ్యింది.

కంగ్ర జిల్లా నగ్రోటా సురియన్ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఓషిన్ శర్మ ధర్మశాల నియోజకవర్గం ఎమ్మెల్యే విశాల్ నెహ్రియాతో ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహం జరిగింది. తనకు కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లైన నాలుగు రోజులకే వెళ్లగొట్టాడని ఓషిన్ శర్మ విమర్శించింది. అప్పటి నుంచి తన తల్లి ఇంటి వద్దే ఉంటున్నానని, నేహ్రియాతో తనకు కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉందన్నారు. పెళ్లికి ముందు భౌతికంగా హింసించడంతో వెనక్కి తగ్గానని, ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. 2019లో ఆయన బిజెపి ఎమ్మెల్యే గా ఎన్నికైన తరువాత పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మారి ఉండవచ్చని అంగీకరించి తప్పు చేసినట్లు ఆమె తెలిపింది. పెళ్లికి ముందు బతిమలాడిన వారు ఇప్పుడు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని ఓషిన్ శర్మ ఆరోపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.