FbTelugu

గోమూత్రం తాగితే కరోనా మటాష్: బిజెపి ఎమ్మెల్యే

లక్నో: కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు గో మూత్రం సేవించాలని బైరియా నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. బాల్లియా జిల్లా బైరియా పట్టణంలో ఆయన ఆవుమూత్రం సేవిస్తూ రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆవు మూత్రం ఎంత మోతాదులో తాగాలో కూడా ఎమ్మెల్యే సూచించారు. గోమూత్రం తాగడం మూలంగా ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేసినా అలసిపోవడం లేదన్నారు. తన ఆరోగ్య రహస్యం ఆవుమూత్రమేనని సురేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు కప్పుల ఆవు మూత్రం కలుపుతానన్నారు. ఇలా తీసుకున్న తరువాత అరగంట పాటు ఏమీ తీసుకోనని చెప్పారు. దీన్ని సేవించడం మూలంగా గుండె జబ్బులు కూడా దరిచేరవన్నారు. అనేక వ్యాధులు నయం అవుతాయని, దీంతో పాటు పాటు పసుపుపొడి వాడితే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. సైన్సును తాను నమ్మినా నమ్మకపోయినా గోమూత్రాన్ని మాత్రం విశ్వసిస్తానని సురేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.