FbTelugu

ప్రైవేటు హాస్పిటల్స్ లో మంత్రులకు చికిత్స: రాజాసింగ్

హైదరాబాద్: ఎవరైనా సరే కరోనా వస్తే గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తామని సీఎం కేసీఆర్  ప్రగల్భాలు పలికారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు.

కేసీఆర్ కు మాట తప్పడం, మోసం చేయడంతో వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకే నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని ఆరోపించారు.

ప్రజలకో న్యాయం, టీఆర్ఎస్ ఎమ్మెల్యలకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్పిటళ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని సందర్శిస్తే ఆయనకు వాస్తవాలు తెలుస్తాయని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.