FbTelugu

బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చింది: కంగనా

ముంబై: బాలీవుడ్ నటి, విమర్శకురాలు కంగనా రనౌత్ కు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయినే నటనపై ఉన్న ఆసక్తితో నో అని చెప్పింది.

ఈ మధ్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ బంధుప్రీతిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కి అనుకూలంగా సమయాన్ని బట్టి స్పందిస్తుంది. మణికర్ణిక చిత్రం తరువాత ఆమెకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు వస్తున్నాయి. రాజకీయాల్లో చేరేందుకే మోదీకి మద్దతు ఇస్తున్నాను అనేది అనుకుంటున్నారని కంగానా వ్యాఖ్యానించింది.
ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ఖండించింది. మా తాత వరుసగా మూడు సార్లు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గ్యాంగ్ స్టర్ చిత్రం తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చిందని కంగానా తెలిపింది. మణికర్ణిక చిత్రం తరువాత బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం రెండు పార్టీల ఆఫర్లను తిరస్కరించినట్లు కంగనా రనౌత్ స్పష్టం చేసింది.

You might also like