FbTelugu

నడ్డా పర్యటనపై బీజేపీ భేటీ

/BJP-meet-Nadda-trip

విజయవాడ: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఏపీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నడ్డా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్ కి విచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం ఇవ్వాళ విజయవాడలోని సీకే గ్రాండ్ హోటల్ లో జరిగింది. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి బూత్ కార్యకర్తల మహా సమ్మేళనం కార్యక్రమంలో నడ్డా పాల్గొనబోతున్నారని కన్నా తెలిపారు. బీజేపీ ని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,000 పోలింగ్ బూత్ లకు బీజేపీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిగతా వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందరేశ్వరి, విష్ణుకుమార రాజు, కామినేని శ్రీనివాస రావు హాజరయ్యారు.

You might also like