FbTelugu

నిమ్మగడ్డతో బీజేపీ నేతల రహస్య భేటీ

హైదరాబాద్: ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ ఎ:పీ సుజనా చౌదరి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ లతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లోఈ ముగ్గురు 13వ తేదీన ఒకే రూమ్ లో కూర్చుని చర్చించిన వీడియో ఫుటేజీలు బయటకు వచ్చాయి. ముగ్గురు వేర్వేరుగా గదులు తీసుకుని ఆ తరువాత ఒకే గదిలో కూర్చుని ఏం చర్చించారనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ నాయకులు నిమ్మగడ్డతో భేటీ అయి చర్చించడం వైసీపీ నాయకులకు కంటగింపుగా మారింది. సుప్రీంకోర్టు లో ఆయన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఈ భేటీ ఎందుకనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చల తరువాత ఎవరికి వారుగా తమ గదులకు వెళ్లిపోయారు.

You might also like