FbTelugu

గ్రేటర్ లో కేంద్ర బలగాలను దించాలి: బీజేపీ డిమాండ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జరగబోయే అక్రమాలను ఎదుర్కోవడానికి  కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను, బలగాలను రప్పించాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కోరడం జరిగిందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు.

ఇవాళ  రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. టీఆర్ఎస్, ఎంఐఎం అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. తరువాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించాలని ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికలు తప్పించుకోవడానికి శాంతి భద్రతల సమస్య సృష్టించలని టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని ఆయన అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ ప్రచారానికి వస్తె టీఆర్ఎస్ ఎందుకు భయపడుతున్నదని లక్ష్మణ్ ప్రశ్నించారు.

మీరు కావాలంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఐఎస్ఐ ఏజెంట్లు, తాలిబన్లను పిలుచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. మతం పేరు చెప్పుకునే మజ్లిస్ పార్టీ ని ఓల్డ్ సిటీలో పేద ముస్లిం లు కూడా వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.