FbTelugu

బీజేపీ నేతల అరెస్టు… ఐపీఎస్ అధికారి రాజీనామా!

కొలకత్తా: మాజీ మంత్రి సువేందు అధికారి ర్యాలీలో గోలీ మారో అంటూ నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకార్తలను అరెస్టు చేసిన ఐపీఎస్ అధికారి అనూహ్యంగా తన పదవికి  రాజీనామా చేశారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 21న మాజీ మంత్రి సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చందానగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ తీశారు. గోలీ మారో అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న పోలీసు కమిషనర్ హుమాయున్ కబీర్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమపై చర్యలు తీసుకోవడంతో బీజేపీ నాయకులు కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు.

బెదిరింపులు వచ్చాయో మరేమో తెలియదు కాని ఘటన జరిగిన వారం రోజులకే  హుమాయున్ కబీర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు తన రాజీనామా లేఖను పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.