FbTelugu

బిజెపి నేతలకు సిగ్గులేదు: హీరో సిద్ధార్థ్

చెన్నై: సినిమా హీరో సిద్ధార్థ్ బిజెపి నాయకులపై విరుచుకుపడ్డారు. తన సినిమాలకు దావూద్ ఫైనాన్స్ చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. నేను అసలైన భారతీయుడినని సిద్ధార్థ్ స్పష్టం చేశారు.

సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నానని వ్యాఖ్యానించాడు. కొద్ది రోజులుగా బిజెపి సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కర్ణాటక బిజెపి ఎంపి తేజస్వీ సూర్యను టెర్రరిస్టుతో పోల్చాడు. ఈ ప్రకటనపై ఏపి బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు.

విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలను సిద్ధార్థ్ ఖండిస్తూ, లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడని అన్నాడు. నేను అసలుసిసలు భారతీయుడిని, పన్ను చెల్లింపుదారుడను  కదరా విష్ణు.. వెళ్లి పడుకో. ఏపి బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట.. ఆయనకు సిగ్గుండాలి అంటూ సిద్ధార్థ్ ఒంటికాలిపై లేచాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.