FbTelugu

విశాఖతో కేటీఆర్ కు ఏం పని: విజయశాంతి

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన కంపెనీలను తెరిచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఆ హమీని వదిలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి రెడ్డి ఆరోపించారు.

విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించడంపై విజయశాంతి రెడ్డి ఘుటుగా బదులిచ్చారు. అమ్మకు అన్నం పెట్టనోడు… చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ వ్యంగంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని అన్నారు. విశాఖ స్టీలు ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంపై కేటీఆర్ స్పందిస్తూ… అవసరమైతే అక్కడికి వెళ్లి నేరుగా ఉద్యమంలో పాల్గొంటానంటూ ప్రకటించడం హాస్యాస్పదమని విజయశాంతి రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో మూతపడిన నిజాం షుగర్స్, అజంజాహీ మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ వంటి కంపెనీలను వంద రోజుల్లో తెరిచి ఉద్యోగాలు కల్పిస్తామని టీఆర్ఎస్ నేతలు ఉద్యమ సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. ఇప్పటి వరకు వాటిని తెరిపించకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పితే గతంలో ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎన్ని బూతు మాటలు మాట్లాడారో ఒకసారి మననం కోవాలని విజయశాంతి రెడ్డి గుర్తు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.