FbTelugu

కన్నా లెంపలేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్

తాడేపల్లి: మీ పార్టీల తప్పుడు నిర్ణయాన్ని మా ప్రభుత్వానికి అంట కట్టవద్దని, తప్పును ఒప్పుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లెంపలు వేసుకోవాలని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలో, మీ పార్టీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే టీటీడీ ఆస్తులు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివరించారు. తప్పు.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూర్తి ఆధారాలతో బయట పెట్టింది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు.

ఆనాడు తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ పార్టీ నేతలకు చెంప దెబ్బలు వేస్తారో.. మీరు లెంపలు వేసుకుంటారో మీ ఇష్టం.. అని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి తప్పును సరి చేసింది.. టీటీడీ ఆస్తులను సంరక్షిస్తున్నదీ మా ప్రభుత్వమేనని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిన్న ఇచ్చిన జీఓ 888 లో విషయాలను పూర్తిగా చెప్పకుండా అర్ధ సత్యాలను ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే  ఘనులు మీరేనని ఆయన విమర్శించారు. మీ రాజకీయ మనుగడ కోసం, పదవి కాపాడుకోవడానికి భక్తులను గందరగోళానికి గురి చేయవద్దని హితవు పలికారు. టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న భూములు అమ్మాలన్ననిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది మా ప్రభుత్వమేనని మంత్రి శ్రీనివాస్ పేర్కోన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.