FbTelugu

ఖజనా ఖాళీ… కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు: ఈటల

హన్మకొండ: నేను ఆర్థిక మంత్రిగా ఉండగా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మిషన్ కాకతీయ బిల్లులు కష్టపడి ఇప్పించేవాడిని కానీ గత రెండేళ్లుగా ఏ బిల్లులు రావడంలేదని మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు.
దిక్కుమాలిన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం లో నడుస్తుందనడానికి ఇదొక ఉదాహారణ మత్రమేనన్నారు. కమలపూర్ మండల కేంద్రంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశయ్యారు. పనులు చేసిన వారు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం హుజూరాబాద్ లో మాత్రం కోట్ల రూపాయలు ఇస్తామని కెసిఆర్ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కెసిఆర్ నమ్ముకునేది డబ్బును, కుట్రను, అవసరానికి మాట్లాడుకునే మోసాన్ని తప్ప ధర్మాన్ని, ప్రజలను నమ్ముకోరని ధ్వజమెత్తారు. వందల కోట్లు డబ్బులు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవొచ్చుగాక ఇక్కడ ధర్మమే గెలుస్తుందన్నారు. ఒకప్పటి నీ సహచరుడుగా నేను అడుగుతున్న 2006 లో నీవెంట ఉన్నది ఎవరు, మేము కాదా ? అప్పటి ప్రభుత్వం ఎంత మందిని కొన్నా ప్రజలు ఎలా వెంట ఉన్నారో, ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి మభ్యపెట్టినా ప్రజలు నీతి, నిజాయితీ వెంటే ఉంటారన్నారు. ఈ ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నదన్నారు. ఈ ఎన్నిక గెలిస్తే గెలిచేది ఈటల రాజేందర్ కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని అన్నారు. ఈ అహంకారం ఒడిపొకపోతే తెలంగాణ కు అరిష్టం అనుకుంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు.

ఈటల రాజేందర్ పెన్షన్లు, రైతు బంధు పథకం వద్దు అన్నారని మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ యువకులు బ్రతకడం కోసం రూ.1లక్ష బ్యాంక్ రుణం ఇవ్వడం లేదన్నారు. కానీ ఇన్ కమ్ టాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఆరు నెలలకు ఒకసారి రూ.4 లక్షలు ప్రభుత్వమే ఇవ్వడం న్యాయమా అని అడిగాను. అలా అడగడం తప్పా అని ఈటల ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారికి, వందల ఎకరాల భూములున్న వారికి కూడా రైతు బంధు చెల్లించడం సమంజసమా అని అడగడం తప్పా?. ఇవ్వాళ కూడా అంటున్నాను… రైతుబంధు పేదవాడికి ఇవ్వు కానీ డబ్బున్నోడికి ఇవ్వొద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె జరిగిన సందర్భంలో ఆ నాయకులు నా దగ్గరకి వచ్చినప్పుడు సంఘాలు ఉంటాయి అని బరాబార్ చెప్పిన అని అన్నారు. కెసిఆర్ పుట్టక ముందు నుండే సంఘాలు ఉన్నాయి. తెలంగాణ లో సంఘాలు పెట్టించింది మేము అన్నారు. ఒక ఉద్యమ ప్రభుత్వం ఇందిరా పార్కు ముందు ధర్నా చౌక్ ఎత్తివేసిన చరిత్ర మీది అని కెసిఆర్ పై మండిపడ్డారు. సిద్దిపేటలో అడ్డా పెట్టి డబ్బులు, కొత్త కార్లు ఇస్తున్నారు. ఇక్కడ ప్రచారానికి వచ్చి వెళ్లిన సురేష్ యాదవ్ మీద సూర్యాపేట లో దాడి చేశారని, టిఆర్ఎస్ పై తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈటల హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.