FbTelugu

నిమ్మగడ్డ కేసులో బీజేపీ నేత కేవియట్

అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టు కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు.

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులోను కేవియట్ పిటీషన్ వేశారు. బీజేపీ నాయకత్వం అనుమతితోనే పిటీషన్ వేసినట్లు మాజీ మంత్రి కామినేని ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించాలని, ఆయనను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, సవరించిన జీఓ కాపీలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ సోమవారం నాడు వేసింది.

You might also like