FbTelugu

బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవు: ఓవైసీ

హైదరాబాద్ : బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని ఏఐఎంఐఎం పార్టీ జాతీయాధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అతి త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

బీజేపీ నేతలు హైదరాబాదుకు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం ఇటీవల వరదలకు అస్తవ్యస్తమైతే.. మోదీ సర్కారు వరద బాధితులకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ తమ గెలుపుకోసం ఉగ్రవాదం, ద్రోహం, పాకిస్థాన్, ఓవైసీ అనే పేర్లను ఎక్కువగా పలుకుతుంటారని అన్నారు. మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.