FbTelugu

టీఆర్ఎస్ ను తొక్కే సత్తా బీజేపీ కే ఉంది: మాజీ ఎంపీ కొండా

అమరావతి: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను, నిలువరించే సత్తా బీజేపీ కే ఉందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ లో పోలయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలిస్తే బీజేపీ సత్తా ఏంటో అర్థమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ లో తేటతెల్లమైందన్నారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను తొక్కే సత్తా బీజేపీకే ఉందని వారు ధృడంగా నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ని ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నది. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరతారనే వార్తలు విన్పిస్తున్న తరుణంలో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.