FbTelugu

నేడు భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ కార్పొరేటర్లు

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ భారీ సంఖ్యలో 48 కార్పొరేటర్లు గెలుపొందిన నేపథ్యంలో.. ఇవాళ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి 48 మంది బీజేపీ కార్పొరేటర్లు సందర్శించనున్నారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుని ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకోవడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.