FbTelugu

తిరుపతి నుంచి బీజేపీ పోటీ: మురళీధరన్

హైదరాబాద్: తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని, జనసేన పార్టీ మద్దతిస్తుందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ మురళీధరన్ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి గెలుపుపై రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు సహా ఇన్ ఛార్జీ సునిల్ దియోధర్ లు జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. తిరుపతి పార్లమెంటు అభ్యర్థి, ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అభ్యర్థి పేరును బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటిస్తుందని బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.