FbTelugu

ఏపీకి రూ.62వేల కోట్లు ఇచ్చాం: బిజెపి

తిరుపతి: ఏపీ లో లోటు బడ్జెట్ కొరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూ.22వేల కోట్లు అందచేస్తుందని, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా నాలుగేళ్లలో రూ.62,168 కోట్లు విడుదల చేసిందని జనసేన, బిజెపి నేతలు ప్రకటించారు.

ఇవాళ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల మేనిఫెస్టోను బిజెపి, జనసేన నాయకులు సంయుక్తంగా తిరుపతిలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ ఏ పథకాలు మంజూరు చేసింది వివరాలతో సహా 108 పాయింట్లతో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి కె.రత్న ప్రభ, బిజెపి ముఖ్య నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్, జివిఎల్.నరసింహారావు పాల్గొన్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.