FbTelugu

జగన్ కేసులో ముద్దాయి బిజెపి అభ్యర్థి: సుంకర పద్మశ్రీ

విజయవాడ: తిరుపతి ఉప ఎన్నికల పోటీలో మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం బీజేపీ నేతలు తాపత్రయ పడుతున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు.

వైసీపీ సూచించిన అభ్యర్దినే బీజేపీ ఎన్నికల్లో పోటీ పెట్టింది, తిరుపతి ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయని ఆమె జోస్యం చెప్పారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రిటైర్డు ఐఏఎస్ అధికారి కె.రత్నప్రభ సిఎం జగన్ కేసులో ముద్దాయి కాదా ? నిలదీసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈమె కూడా ఎసిబి, ఈడీ కేసులను ఎదుర్కొన్నదని పద్మశ్రీ తెలిపారు.

తిరుపతి ఉప ఎన్నికల కోసం ఏపీలో వలస పక్షులు తిరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికలల్లో తమదే గెలుపు అని ధీమా ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్సలు తిరుపతి సరిహద్దులు అయినా సునీల్ దేవధర్ కి తెలుసా ?. తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత ఏపీకి ప్రత్యేకహోదా అని ఇచ్చిన హామీ ఏమైంది ? అని పద్మశ్రీ నిలదీశారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా ? అని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ప్రశ్నించింది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన చింతా మోహన్ గెలుపు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి మలుపు అని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.