FbTelugu

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ని బహిష్కరించిన బీజేపీ

అమరావతి: పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ ను, ఆంధ్రజ్యోతి పత్రికను ఏపీ బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. టీడీపీ కరపత్రం, ప్రసార సాధనంగా పనిచేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేసింది.
బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించలేదని నిలదీసింది.

తిరిగి మరుసటి రోజు చర్చకు ఆహ్వానించి టీడీపీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.
టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ ను, ఆంధ్రజ్యోతి దిన పత్రికను నేటి నుంచి మీడియా సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు పార్టీ ప్రకటించింది. తమ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ, ఎబిఎన్ ఛానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిని పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. టీవీ ఛానల్ పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకై బిజెపి ఉపక్రమిస్తుందని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.