FbTelugu

ఎస్వీబీసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: విష్ణువర్థన్

విజయవాడ: కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఎస్వీబీసీ ఛానల్ బాధ్యుల మీద చర్యలు చేపట్టాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని 250 టీవీ ఛానళ్లు అయోధ్యలో భూమిపూజను ప్రత్యక్ష ప్రసారం చేశాయని, కానీ తిరుమల భక్తి ఛానల్ లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు.

వివిఐపీలు, రాజకీయ నాయకుల తిరుమల దర్శనం మాత్రం ముందు వరుసలో కనపడుతాయన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయెూధ్య ప్రసారాలుఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్వీబీసీ సీఈఓ వెంకట నాగేష్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

You might also like